Sahithi Prachuranalu

Sagara Pushpam

Sagara Pushpam
Sagara Pushpam

Sagara Pushpam

Rs. 60.00 Rs. 75.00
  • SKU: 15192309

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Koganti Vijayalaxmi

Language : TELUGU

Book Description

‘మెర్‍మెయిడ్లు... సాగరకన్యలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలుగా అనేకమంది చెబుతూ వస్తోన్న విషయం అబద్ధం కాదు. అందులో అసత్యం ఏమాత్రం లేదు. మెర్‍మెయిడ్లు ఉన్నాయి. అయితే వాటిని చూసిన వారు ఎక్కువ మంది లేరు. వారు తెలిపిన విషయాలను నిజంగా చూడని వారు కూడా చెబుతూ రావడంతో మెర్‍మెయిడ్లు ఉన్నాయనే నగ్నసత్యం అబద్ధంగా మారిపోయింది. చరిత్రలో పురాతన కాలంలో కొందరు మెర్‍మెయిడ్లను చూశారు. అయితే సంచలనం కోసమో, పేరు కోసమో నిజంగా మెర్‍మెయిడ్లను చూసిన వారు చెప్పినదాన్ని, చూడనివారు వల్లె వేస్తూ వచ్చి దీనిపై అనేక సందేహాలు పుట్టుకొచ్చేలా చేశారు. మెర్‍మెయిడ్లు అనేవి సగం మానవాకృతి, సగం చేపను పోలిన జీవులు. అవి తల నుండి నడుం వరకు అచ్చు మామూలు స్త్రీలాగా ఉంటే నడుం దిగువ భాగం నుండి మాత్రం చేపను పోలి ఉంటాయి. కాళ్లకు బదులు తెడ్డులాగాను, తోకలాగాను ఉండే భాగం ఉంటుంది. దాని సాయంతో మెర్‍మెయిడ్లు ఎంత దూరమైనా ఈదుతూ సాగిపోతాయి. ఆ వేగం ఊహించతరం కాదు. అలాగే మెర్‍మెయిడ్లు... సాగరకన్యలు ఎంతో అందమైనవి. వాటి కురులు నల్లగా నిగనిగ మెరుస్తూ ఎంతో అందంగా ఉంటాయి. వాటిని చూసిన మామూలు మనుషులు ఆశ్చర్యం, భయంతో, షాక్‍తో మాట రాకుండా ఉండిపోతే అవి అక్కడి నుండి నీట్లోకి దూసుకుపోతాయి. అవి మాట్లాడినట్లు గానీ, మామూలు మనుషులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు’ ఈ మెర్‍మెయిడ్ల గురించి అన్ని విషయాలు తెలుసుకున్న దీక్ష, అక్షజ్‍ అన్వేషణకి బయలుదేరారు. వారి అన్వేషణ ఫలించిందా! లేదా! చదివి తెలుసుకొనండి...

Additional information
Code SPBK-307
SKU 15192309
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Koganti Vijayalaxmi
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter